మీకు క్రిమినల్ రికార్డ్ ఉందా.. బీజేపీ దరఖాస్తులో ప్రత్యేక కాలమ్

మీకు క్రిమినల్ రికార్డ్ ఉందా.. బీజేపీ దరఖాస్తులో ప్రత్యేక కాలమ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి బీజేపీ అప్లికేషన్లు తీసుకుంటుంది. 2023 సెప్టెంబర్ 04 సోమవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది.అయితే దరఖాస్తు ఫామ్ లో బీజేపీ నాయకత్వం ఆశావహులు క్రిమినల్ కేసుల వివరాలు అడుగుతుంది.  ఎన్ని కేసులున్నాయో  సవివరంగా చెప్పాలని ఆదేశించింది.  

దరఖాస్తు ప్రత్యేక ఫారంను మొత్తం  నాలుగు విభాగాలుగా రూపొందించిన రాష్ట్ర నాయకత్వం..  మొదటి విభాగంలో వ్యక్తి బయోడేటా,  చేసిన రాజకీయ కార్యక్రమలను అడుగుతోంది. ఇక రెండో విభాగంలో గతంలో పోటీ చేసిన ( ఎంపీ, ఎమ్మెల్యే, స్ధానిక సంస్థలు) వివరాలు అందులో వచ్చిన ఓట్లను ప్రశ్నిస్తుంది.  మూడో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను అడుగుతుంది. చివరి నాలుగో విభాగంలో ఏమైన క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు, శిక్షపడిన కేసులు వివరంగా  పొందుపరచాలని కోరుతోంది.  

ఆశావహుల నుంచి అప్లికేషన్లు  తీసుకున్న తరువాత నియోజకవర్గాలవారీగా వచ్చిన అప్లికేషన్లను రాష్ర్ట నేతలు పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపిస్తారు. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఒక్కో సీటుకు భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.