ఆదివారం అతిథులకు తెలంగాణ స్పెషల్ వంటకాలు

ఆదివారం అతిథులకు తెలంగాణ స్పెషల్ వంటకాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన అతిథుల కోసం ప్రత్యేక వంటకాలు రెడీ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా గెస్టులకు రేపు తెలంగాణ వంటకాలను రుచి చూపించనున్నారు. ఇవాళ ఉత్తరాది వంటలను వడ్డిస్తున్నారు. రేపటి మెనూలో తెలంగాణ స్పెషల్ వంటకాలను.. నోరూరించే ప్యూర్ వెజ్ ఐటెమ్స్ వడ్డిస్తారు. 

రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం వేరుసెనగలు కలిపిన అటుకులు, కార్న్ సమోసాలు, మైసూర్ పాక్, మొక్కజొన్న వడలను అతిథులకు అందిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ కింద...తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన అంబలిని సూప్ గా ఇస్తారు. పెరుగన్నం, పెరుగు పునుగులు, సల్ల పులుసు బజ్జీలు, అప్పడాలు, వడియాలు, సర్వపిండిని వడ్డిస్తారు. వీటితో పాటు రెండు రకాల పచ్చళ్ళు, సల్ల మిరపకాయలు, పుంటికూర పచ్చడి, టమాట పల్లీ చట్నీ మెనూలో ఉంది. గంగవల్లి మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, బగారా రైస్, జొన్న రొట్టెలు కూడా పెడతారు. ఇవి కాకుండా నువ్వుల లడ్డు, పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, అరిసెలు, జున్ను కూడా వడ్డిస్తారు. ఇంకా పెసర పప్పు గారెలు, మిర్చి బజ్జీలు, అలూ సబ్జీతో కలిపి భర్వీ పూరీ, పల్లి పట్టీలు, టమాటా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి పాల పచ్చడిని అతిథులకు వడ్డించబోతున్నారు. ఇంకా సర్వపిండి, అరిసలు, సకినాలు, కోవా గరిజలు కూడా అందిస్తారు. 

ఇవే కాకుండా స్నాక్స్ ఐటెమ్స్ లో హైదరాబాద్ స్పెషల్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి.  కారా బిస్కెట్లు, ఫ్రూట్ బిస్కెట్లు, దిల్ ఖుష్, మస్కా బన్, రస్క్ లు, లుక్మీ సమోసా, పట్టి సమోసా, వెజ్ కర్రీ పప్స్, హైదరాబాదీ చాయ్, లెమన్ టీలాంటివి అతిథులకు అందిస్తారు.