హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెండ్రోజులపాటు స్పెషల్ డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహించగా, 925 మంది పట్టుబడ్డారు.
సిటీ పోలీసుల డ్రైవ్‌లో 468 మంది, సైబరాబాద్పోలీసుల డ్రైవ్‌లో 457 మంది దొరికారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సైబరాబాద్‌లో తాగి నడిపిన వారిలో 335 మంది బైకర్లు, త్రీవీలర్స్నడిపిన వారు 25 మంది, ఫోర్వీలర్స్నడిపిన వారు 107 మంది ఉన్నారు. అలాగే ఒకరు హెవీవెహికల్ ను కూడా తాగి నడిపారు.
రెండు కమిషనరేట్లలో తాగిన వారిలో 844 మందికి 200 ఎంజీ పాయింట్ల రాగా.. 200 నుంచి 300లోపు వచ్చిన వారు 65 మంది, 300 నుంచి 500 వచ్చిన వాళ్లు 16 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గత వారంలో నమోదైన 681 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 613 మందికి జరిమానా పడగా.. మరో 50 మందికి సోషల్‌వర్క్, 18 మందికి ఫైన్‌తో పాటు జైలు శిక్ష పడిందని పోలీసులు తెలిపారు.
