హైదరాబాద్ సిటీ, వెలుగు: భారతీయ హ్యాండ్లూమ్ కళల వైభవాన్ని చూపే. ‘స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో’ అమీర్పేట్ కమ్మ సంఘం ప్రాంగణంలో గురువారం ప్రారంభమైంది. ఇక్కత్హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ , మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు.
ఫిబ్రవరి 4 వరకు ఈ ఎక్స్‌పో కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల నుంచి వచ్చిన హ్యాండ్‌లూమ్ కళాకారులు తమ అద్భుతమైన వస్త్రలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు.
