ఖానాపూర్, వెలుగు: కొత్తగా ఏర్పడ్డ ఖానాపూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు.
ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్యం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సహకారంతో మున్సిపల్ ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాల్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కౌన్సిలర్లు కిషోర్ నాయక్, ఆఫ్రీన్ బేగం, ఫౌజియా, విజయ లక్ష్మి, పరిమి లత, శ్రీనివాస్, ఖలీల్, కో ఆప్షన్ సభ్యులు కిషోర్, మలాన్ బేగం, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.