కంటెయిన్​మెంట్​ జోన్​ స్టూడెంట్లకు స్పెషల్ రూమ్

కంటెయిన్​మెంట్​ జోన్​ స్టూడెంట్లకు స్పెషల్ రూమ్
  • ఎక్కువ మంది ఉంటే స్పెషల్​ సెంటర్​
  • టెన్త్​ ఎగ్జామ్స్​పై విద్యాశాఖ కసరత్తు
  • పెద్ద జిల్లాలపై స్పెషల్​ ఫోకస్​
  • అదనంగా 2,005 పరీక్షా కేంద్రాలు
  • చెక్​ చేయకుండానే సెంటర్​లోకి స్టూడెంట్లు

టెన్త్​ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలు, స్టూడెంట్లు ఎక్కువున్న జిల్లాలపై ఫోకస్​ పెట్టారు. కంటెయిన్​మెంట్​ జోన్​ నుంచి వచ్చే స్టూడెంట్లకు ప్రత్యేక రూంలు కేటాయించనున్నారు. అలాంటి స్టూడెంట్లు ఎక్కువగా ఉంటే అవసరానికి తగ్గట్టు ప్రత్యేకంగా సెంటర్​ కూడా ఏర్పాటు చేయనున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్​ 6 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ, కరోనా లాక్​డౌన్​తో మార్చి 23 నుంచి వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్​డౌన్​ రూల్స్​ సడలించడంతో హైకోర్టు నుంచి పర్మిషన్​ తీసుకుని జూన్​ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా 5,34,903 మంది పరీక్షలు రాయనున్నారు. మిగిలిపోయిన 8 పరీక్షల కోసం ప్రస్తుతమున్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకూ చర్యలు మొదలుపెట్టారు. పరీక్షల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలను టీచర్ల ద్వారా వివరిస్తున్నారు.

6 జిల్లాల్లోనే 2.42లక్షల విద్యార్థులు..

హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​, నిజామాబాద్​, సంగారెడ్డి, నల్గొండ వంటి 6 జిల్లాల్లోనే 2,42,006 మంది స్టూడెంట్లు పరీక్షలకు హాజరవుతారని హైకోర్టుకు ఈమధ్య విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఆ జిల్లాల్లో ఇంతకుముందు 1,109 పరీక్షా కేంద్రాలుంటే, మరో 998 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. స్టూడెంట్స్​ను దూరంగా కూర్చోబెట్టాలని డీఈవోలకు ఇప్పటికే ఆదేశాలూ ఇచ్చారు. కుమ్రంభీం, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, మహబూబాబాద్​, వరంగల్​ రూరల్​, సిరిసిల్ల, జనగామ, జోగులాంబ గద్వాల, వనపర్తి, ములుగు, నారాయణపేట తదితర 11 జిల్లాల్లో పదివేల లోపు స్టూడెంట్స్​​ఉన్నారు. ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో స్టూడెంట్ల పట్ల స్పెషల్​ కేర్​ తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కరోనా భయంతో ఈసారి స్టూడెంట్లను చెక్​ చేయకుండానే లోపలికి పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలన్న రూల్​తోనే నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఫిజికల్​ డిస్టెన్స్​ కోసం ఎక్కువ సెంటర్లు

కరోనా మరింత మందికి వ్యాపించకుండా హైకోర్టు ఆదేశాలతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. హోం క్వారంటైన్​, కంటెయిన్​మెంట్​ జోన్లలోని స్టూడెంట్లకు స్పెషల్​ రూంలు ఏర్పాటు చేస్తాం. ఎక్కువమంది ఉంటే అవసరమైతే అదే ఏరియాలో వేరే సెంటర్​ ఏర్పాటు చేస్తాం. ఫిజికల్​ డిస్టెన్స్​ కోసం సెంటర్లను పెంచాం. కొత్త సెంటర్లన్నీ ప్రస్తుతమున్న కేంద్రాలకు కిలోమీటర్​ దూరంలోపే ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

– సత్యనారాయణరెడ్డి, పరీక్షల విభాగం డైరెక్టర్​

ప్రైవేట్ టీచర్లకు జీతాలిప్పించాలే