అసలు హర్షసాయి ఎవరు..? ఎలా ఫేమస్ అయ్యాడు..

అసలు హర్షసాయి ఎవరు..? ఎలా ఫేమస్ అయ్యాడు..

పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి ఫ్రీగా పెట్రోల్ పోస్తుంటాడు. ఓ బార్బర్ షాపుకెళ్లి అతడి గురించి తెలుసుకుని పక్కా షాప్ కట్టిస్తాడు. ఓ గుడిసెలోకి వెళ్లి ఆ ఇంటి వాళ్లు ఊహించనంత డబ్బు వాళ్ల ముందు పెడతాడు. చిన్న చిన్న గేమ్స్ పెట్టి లక్షల రూపాయలు పంచి పెడతాడు. ఓ పేద పిల్లవాడి స్కూల్ ఫీజు కడుతాడు. మరోవైపు ఈ వీడియోలన్నీ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఫాలోవర్స్ పెరుగూతూనే ఉంటారు. ఇలా డిఫరెంట్ వీడియోస్ తో అతితక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు హర్షసాయి.

సోషల్ మీడియా ఫాలో అయ్యోవారికి హర్షసాయి ఫేమస్ పర్సన్. రియల్ లైఫ్ శ్రీమంతుడు అనే పేరును సంపాదించుకున్నాడు. 2018లో యూట్యూబ్ లో అడుగుపెట్టిన హర్షసాయి తనదైన టాలెంట్ను జోడించి విభిన్న కాన్సెప్ట్ తో అతితక్కువ కాలంలోనే లక్షలమంది ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. విజయనగరానికి చెందిన ఇతడు మొదట తనకు ఇష్టమైన సైన్స్ తోపాటు పదిమందికి ఉపయోగపడే శరీరాకృతి, ఎడ్యుకేషన్ కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. ఆ తర్వాత రూట్ మార్చి పేదవారికి సాయం చేయడం వంటివి చేసి, ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో అవి బాగా పాపులర్ అయ్యాయి. 

యూట్యూబ్ లో అందరు డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే హర్షసాయి మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తున్నాడు. ఓసారి తన సబ్ స్క్రైబర్ల కోసం ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి అందరు అవాక్కయ్యేలా చేశాడు హర్షసాయి. అంతేకాదు.. ఎంతోమంది పేదవారి చిన్న చిన్న కలలను సాకారం చేశాడు. అవసరాన్ని బట్టి లక్షలు సైతం దానం చేసి దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన వీడియోలు కొత్తగా ఉంటాయి. సగటు ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తాయి. చిన్న చిన్న గేమ్స్ డిఫరెంట్ ఐడీయాలతో జనాన్ని ఎంగేజ్ చేస్తుంటాడు. ఛానెళ్ల ద్వారా వచ్చిన మనీని మళ్లీ వాటికే ఖర్చు చేస్తుంటాడు. ఫాలోవర్లు పెరగడం కోసం జనాన్ని సర్ ప్రైజ్ లతో ముంచెత్తుతాడు.

హర్షసాయి వీడియోలు అన్నింటికి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా అతడి వాయిస్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇక తన సబ్ స్క్రైబర్స్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. వారి మనుసులో ఉండే కోరికలను తీర్చి సర్ప్రైజ్ చేస్తుంటాడు. హర్షసాయి అలా వీడియో చేశాడో లేదో మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతుంటాయి. ఇతడు వీడియో చేస్తే మిలియన్ల వ్యూసే కాదు లక్షల్లో ఖర్చవుతుంది కూడా. అతనికి అంత డబ్బు ఎక్కడిది అంటే వారిది సంపన్న  కుటుంబం కావడమే. హర్షసాయి చేస్తున్న మంచి పనులకు మంచి పేరు వస్తుండడంతో కుటుంబ సభ్యులు కూడా అతడికి ఎక్కడా అడ్డుచెప్పలేదని తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఓ పేద కుటుంబం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపాడు హర్షసాయి.