హాస్టళ్లపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొరడా.. 30 హాస్టళ్లకు నోటీసులు.. ఐదు హాస్టళ్లలోని కిచెన్లు సీజ్

హాస్టళ్లపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొరడా.. 30 హాస్టళ్లకు నోటీసులు.. ఐదు హాస్టళ్లలోని కిచెన్లు సీజ్
  • అమీర్‌‌పేట, అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లో 58 చోట్ల తనిఖీలు  
  • రూల్స్​బ్రేక్​చేస్తున్న నిర్వాహకులకు రూ. 2.5 లక్షల జరిమానా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫుడ్ సేఫ్టీ, ఏఎంహెచ్ఓ, టౌన్ ప్లానింగ్, డిప్యూటీ కమిషనర్లతో కలిపి ఏర్పాటు చేసిన బల్దియా స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్క్వాడ్‌‌ రంగంలోకి దిగింది. తొలి ఆపరేషన్ లో భాగంగా శుక్రవారం ఒక్కరోజే అమీర్‌‌పేట, అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లోని 58 హాస్టళ్లలో తనిఖీలు చేపట్టింది. చాలా చోట్ల ఫుడ్ సేఫ్టీ, పారిశుద్ధ్య పాటించడం లేదని, టౌన్ ప్లానింగ్, ఫైర్​సేఫ్టీ రూల్స్​రూల్స్​బ్రేక్​చేశారని గుర్తించారు. 

సెల్లార్లను, పార్కింగ్ ప్రాంతాలను హాస్టల్స్ కోసం వాడుతున్నారని, అపరిశుభ్రంగా నాణ్యత లేని ఆహారాన్ని పెడుతున్నారని, చాలా చిన్న గదుల్లో విద్యార్థులను ఉంచుతున్నారని, సరైన మరుగుదొడ్లు లేవని, వీధుల్లో వ్యర్థాలను పడేస్తున్నారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్క్వాడ్‌‌ అశోక్ నగర్ ఏరియాలో 20, దిల్ సుఖ్​ నగర్ ప్రాంతంలో 23, అమీర్ పేటలో 15 హాస్టల్స్ ను తనిఖీ చేసి 30 హాస్టళ్లకు నోటీసులు ఇచ్చారు. 5 హాస్టల్స్​కిచెన్లను క్లోజ్​చేశారు. రూ.2,45,500- జరిమానా విధించారు.