
- సిగాచీలో సహాయక చర్యలు.. క్షతగాత్రుల చికిత్సపై ఆరా
సంగారెడ్డి, వెలుగు : పాశమైలారం సిగాచీ పరిశ్రమకు గురువారం బిహార్ అధికారుల బృందం ప్రత్యేక బృందం చేరుకుంది. సిగాచీ పేలుడు ఘటనలో బిహార్ వాసులు ఎక్కువగా ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి స్పెషల్ ఆఫీసర్ తోపాటు నలుగురు అధికారుల బృందం సిగాచీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల వివరాలు, గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుల గురించి ఆరా తీశారు.
సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఘటనకు సంబంధించిన వివరాలు వారికి తెలియజేశారు. అయితే మృతుల కుటుంబాలు, ఆచూకీ లేకుండా పోయిన వారి బంధువులు బిహార్ అధికారులను కలిసి వారి బాధలు చెప్పుకున్నారు. పటాన్ చెరు ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. బిహార్ అధికార బృందం రెండు రోజులపాటు ఇక్కడే ఉండనుంది.