రైల్వేశాఖ గుడ్ న్యూస్​: పండుగలకు స్పెషల్​ ట్రైన్లు..

రైల్వేశాఖ గుడ్ న్యూస్​:  పండుగలకు స్పెషల్​ ట్రైన్లు..
 
  • దసరా, దీపావళికి 6 వేల ప్రత్యేక రైళ్లు

  • 2 నెలలు స్పెషల్‌‌‌‌ ట్రైయిన్లు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: దసరా, దీపావళి పండుగలతో పాటు ఛత్ పూజ సందర్భంగా 6 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి నవంబర్‌‌‌‌‌‌‌‌ 30 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లను నడవనున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా.. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని తెలిపింది. 

దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా లక్షల మంది ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్తుంటారని, రద్దీని దృష్టిని పెట్టుకొని 6 వేల ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ అన్నారు.  పండుగల సందర్భంగా తెలంగాణ నుంచి ఈసారి భారీ సంఖ్యలో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌‌‌‌ తదితర ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్తారన్నారు.