వినాయక చవితికి కొత్త పోస్టర్లతో స్పెషల్ ట్రీట్

V6 Velugu Posted on Sep 12, 2021

పండుగ వస్తే ప్రతి ఇంట్లోనూ సందడి నెలకొంటుంది. అయితే అంతకు మించిన సందడి సినీ ఇండస్ట్రీలో కనిపిస్తుంది. కొత్త సినిమాల ఓపెనింగ్స్, అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్స్, అప్‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌తో సినీ ప్రియుల్ని సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తుంటారు మేకర్స్. ముఖ్యంగా కళకళలాడే కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తుంటారు. ఈ వినాయక చవితికి కూడా కొన్ని పోస్టర్లతో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

వరుడు సో కూల్‌‌‌‌‌‌‌‌
ఏ పండుగ వచ్చినా నాగశౌర్య కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్. అన్ని సినిమాలు చేస్తున్నాడు మరి. వాటిలో లక్ష్మీసుజాత తెరకెక్కిస్తున్న ‘వరుడు కావలెను’ ఒకటి. వినాయక చవితి నాడు ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఎంతో కూల్‌‌‌‌‌‌‌‌గా ఉండి ఆకట్టుకుంది. రీతూవర్మ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. సినిమా అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విడుదల కానుంది.

నందిని నయగారం
నిఖిల్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఆమె పోషిస్తున్న నందిని పాత్రను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదిలారు. అందమైన అడవి.. పచ్చని చెట్లు.. ప్రశాంతమైన వాతావరణం. ఓ సీతాకోక చిలుక వచ్చి అనుపమ చేతిపై వాలింది. ఆమె అందమైన ముఖం రివీల్ అయ్యింది. విజు వల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు అనుపమ కూడా ఎంతో ఆకట్టుకుంది.     

భళా క్యాథరీన్
ఎక్కువగా మోడర్న్‌‌‌‌‌‌‌‌ డ్రెస్సులతో మెప్పించే క్యాథరీన్ థ్రెసా.. వినాయక చవితికి చీరకట్టులో ప్రత్యక్షమయ్యింది. శ్రీవిష్ణు హీరోగా ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి తెరకెక్కిస్తున్న ‘భళా తందనాన’ చిత్రంలో శశిరేఖగా నటిస్తోంది క్యాథరీన్. అందులోని లుక్కే ఇది. గులాబి రంగు చీరలో ఎంతో అందంగా కనిపిస్తోందామె. తనది ధైర్యం, సాహసం కలిగిన స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ అమ్మాయి పాత్రట. శుక్రవారం ఆమె పుట్టినరోజు కూడా కావడంతో ఇలా పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విషెస్ చెప్పారు దర్శక నిర్మాతలు. రజినీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ రామచంద్రరాజు విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సామాన్యుడి సందడి
త్వరలో ‘ఎనిమీ’తో రాబోతున్న విశాల్.. ఆ తర్వాత ‘సామాన్యుడు’గా రావడానికి రెడీ అవు తున్నాడు. ‘నాట్ ఎ కామన్‌‌‌‌‌‌‌‌ మేన్’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ డ్రామాకి శరవణన్ దర్శకుడు. విశాల్ నిర్మిస్తున్నాడు. తన బర్త్‌‌‌‌‌‌‌‌ డేకి ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకెండ్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ని వదిలారు. పగిలిన గాజు సీసాను పట్టుకుని యాక్షన్‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు విశాల్. డింపుల్ హయతి హీరోయిన్‌‌‌‌‌‌‌‌. యోగిబాబు, తులసి, రవీనా రవి  నటిస్తున్నారు. యువన్ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. సినిమా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ కానుంది. 

ఇది ‘మరో ప్రస్థానం’
ఒకప్పుడు లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోయ్‌‌‌‌‌‌‌‌గా అలరించిన తనీష్.. కాస్త గ్యాప్‌‌‌‌‌‌‌‌ తర్వాత యాక్షన్ హీరోగా రాబోతున్నాడు. జాని డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో అతను నటించిన ‘మరో ప్రస్థానం’ మూవీ అతి త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఓ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కొన్ని విశేషాలను కూడా షేర్​ చేశారు మేకర్స్. ఈ సినిమా రీల్ టైమ్, రియల్‌‌‌‌‌‌‌‌ టైమ్ ఒకటేనట. కథ ఎంత టైమ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుందో అదే టైమ్‌‌‌‌‌‌‌‌కి మూవీ కంప్లీటవుతుందట. ఎలాంటి కట్స్, జర్క్స్‌‌‌‌‌‌‌‌, రివైండ్ షాట్స్ లేకుండా సింగిల్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌లో సినిమాని పూర్తి చేసినట్లు చెబుతున్నారు. భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. 

Tagged Vishal, anupama parameshwaran, enemy, 18 pages, Nikhil, Catherine Tresa, NAGA SHOURYA, Varudu, bhala thandanana, tanish, maro prasthanam

Latest Videos

Subscribe Now

More News