
వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌తో విశాఖలో అధికారులు అలర్ట్ అయ్యారు. విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి (KGH) లో కరోనా బాధితుల కోసం మూడు పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు బాధితులెవరూ లేరన్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్. అయితే అత్యంత ప్రమాకరమైన వైరస్ కావడంతో ముందస్తు జాగ్రత్తగా పలు చర్యలు చేపట్టామన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ తీవ్రత అధికంగా ఉంటే కిడ్నీలపై దాని ఎఫెక్ట్ పడుతుందన్నారు. ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని… అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోకి, మార్కెట్ కి వెళ్లేటప్పుడు ముఖానికి కర్చీఫ్, పేస్ మాస్క్ ధరిస్తే మంచిదన్నారు.