
హైదరాబాద్:హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2025 జనవరి 25న ఈ కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. శివబాలకృష్ణపై ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.
అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులు లేఅవుట్‌లకు అనుమతి మంజూరు చేయడం కోసం రియల్టర్లతో శివ బాలకృష్ణ చేసిన క్విడ్ ప్రోకో ఒప్పందాలపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే బుధవారం (జూలై 2) శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు, కుటుంబ సభ్యుల ఇండ్లలో ఈడీ రైడ్స్ చేస్తోంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, చైతన్యనగర్‌లలో సోదాలు నిర్వహిస్తోంది. సోదాల్లో భాగంగా ఈడీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, రూ.100 కోట్లు అక్రమంగా కూడబెట్టినట్లు శివబాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి.
►ALSO READ | AIG తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులు.. 2025 నాటికి 7 వేల బెడ్స్తో నిర్మిస్తాం: సీఎం రేవంత్