బీసీసీఐ రూ. 117 కోట్లు కేటాయించినా .. మారని ఉప్పల్ స్టేడియం

బీసీసీఐ  రూ. 117 కోట్లు కేటాయించినా ..  మారని ఉప్పల్ స్టేడియం

రేపటినుంచి వరల్డ్ కప్ 2023  సందడి  మొదలుకానుంది.  భారత్ వేదికగా జరగబోతున్న ఈ  మెగా టోర్నీకి  పది స్టేడియాలను బీసీసీఐ సిద్ధం చేసింది. అందులో హైదరాబాద్ లోని ఉప్పల్  స్డేడియం ఒకటి.  ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి.  అక్టోబర్‌ 6న పాకిస్థాన్-నెదర్లాండ్స్‌, అక్టోబర్‌ 9న న్యూజిలాండ్‌-నెదర్లాండ్స్‌, అక్టోబర్‌ 10న పాకిస్థాన్‌ - శ్రీలంక హైదరాబాద్‌ వేదికగా తలపడనున్నాయి.  

వరల్డ్ కప్ సందర్భంగా మ్యాచ్ లను నిర్వహించే  స్టేడియాల్లో  వసతుల కల్పన కోసం బీసీసీఐ భారీ మొత్తంలో ఖర్చు చేసింది.  ఉప్పల్ స్టేడియానికి బీసీసీఐ రూ.119కోట్లు కేటాయించింది.  ఈ స్థాయిలో ఖర్చు చేసినా.. స్టేడియంలో  పరిస్థితి దారుణంగా ఉంది.  మంగళవారం ఉప్పల్ స్డేడియం వేదికగా  పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మధ్యవార్మప్ మ్యాచ్ జరిగింది.   ఈ మ్యాచ్ కు  చూసేందుకు అభిమానులు భారీ స్థాయిలోనే వచ్చారు.   స్డేడియంలో సౌకర్యలు  ఏ మాత్రం బాలేవని ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుభ్రంగా లేని సీట్లను వీడియోలు, ఫొటోలు తీసి పోస్టులు పెట్టారు.  దీనికోసమేనా కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై క్రీడా విశ్లేషకుడు సి.వెంకటేశ్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ చూసేందుకు ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లిన ఆయన.. అక్కడున్న పరిస్థితులను చూపేలా.. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో పెద్దగా మార్పులేం చేయలేదు అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.