ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
  •     ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై హౌసింగ్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏఈలతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  జిల్లాలో ఇప్పటిదాకా 7,408 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. 5,571 ముగ్గు పోశామని, 4,544 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో, 3,193 గోడల లెవెల్ లో, 2,370 స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని వెల్లడించారు. ప్రతి ఎంపీడీవో ప్రతి రోజూ 10 ఇండ్ల పురోగతిని పరిశీలించాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్ధిదారులకు ఇటుకులు, ఇతర సామగ్రి సరైన ధరకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. 

అనంతరం బోయినిపల్లి మండలంలో 23, తంగళ్లపల్లి మండలంలో 14 ఇండ్లు పూర్తయ్యాయని, అందుకు కృషి చేసిన ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులను అభినందించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్, ప్రత్యేక అధికారులు గీత, అఫ్జల్ బేగం, లక్ష్మీరాజం, రవీందర్ రెడ్డి, హనుమంతు, షరీఫుద్దిన్, రామకృష్ణ, క్రాంతి, నజీర్ అహ్మద్, ఎంపీడీవోలు, ఏఈలు పాల్గొన్నారు.

9లోపు అభ్యంతరాలు తెలపండి

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9లోపు తెలియజేయాలని ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ముసాయిదా ఓటర్ జాబితాపై సిరిసిల్ల, వేములవాడకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ లో  మంగళవారం సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యంతరాల స్వీకరణ అనంతరం 10నతుది జాబితా  విడుదల చేస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, వివిధ పార్టీల లీడర్లు సూర దేవరాజు, గోపి, చక్రపాణి, రమేశ్‌‌‌‌‌‌‌‌, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.