బైక్ లేదా కారు నడుపుతున్నపుడు ఆక్సిలరేటర్ పెంచడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. వేగంగా వెళ్తున్న ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అతివేగం ప్రమాదాలకు కారణం కావచ్చు..నడిపే వారు మాత్రమే కాదు, అమాయక ప్రయాణికులు కూడా బలవుతారు. వేగాన్ని నియంత్రించకపోతే, ట్రాఫిక్స్ రూల్స్ పాటించకపోతే ఏం జరుగుతుందో రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అందుకు సాక్ష్యం. రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగూడ దగ్గర అతివేగంతో హోండా అమేజ్ నలుగురిని ఢీకొట్టింది. అమాయకులను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. వారి కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగూడ శేరిగూడ స్టేజీ దగ్గర శనివారం (మార్చి21) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. బస్సుకోసం రోడ్డుపక్కన కూర్చున్న నలుగురిని వేగంగా దూసుకొచ్చిన హోండా అమేజ్ కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో నరాలపోచమ్మ, నరాల అలివేలు, లక్ష్మమ్మ, పెంటమ్మలను ఢీకొనడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని సాయి సంజీవని ఆస్పత్రికి తరలించారు. బాధితులను వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతలో వేగం ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా ఖరీదైన బైక్‌లు, కార్లు వచ్చిన తర్వాత రోడ్లపై విన్యాసాలు చేయడం పెరిగిపోయింది.భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 70% కంటే ఎక్కువ 'అతివేగం' వల్లే జరుగుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. అతివేగం.. క్షణకాలపు థ్రిల్ అనేక మంది జీవితాల్లో విషాదం నింపుతున్నాయి.
అతివేగంపై పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అతివేగానికి సెక్షన్ 183 (MV Act) కింద భారీ ఫైన్ ,ప్రమాదకరంగా వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఎదుటివారి మరణానికి కారణమైతే నాన్-బైలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.
