రాజేంద్రనగర్‌ డైరీ ఫామ్‌‌ చౌరస్తాలో లారీ బోల్తా.. టమాటాలు నేలపాలు

రాజేంద్రనగర్‌ డైరీ ఫామ్‌‌ చౌరస్తాలో లారీ బోల్తా.. టమాటాలు నేలపాలు

గండిపేట్, వెలుగు: రాజేంద్రనగర్‌‌ డైరీ ఫామ్‌‌ చౌరస్తాలో వేగంగా వెళ్తున్న లారీ పల్టీ కొట్టడంతో అందులో ఉన్న టమాటాలు నేలపాలయ్యాయి. శంషాబాద్‌‌ నుంచి మెహిదీపట్నం వైపు ఓ లారీ వేగంగా వస్తుంది. రాజేంద్రనగర్‌‌ పి.వి.నర్సింహ్మరావు ఎక్స్‌‌ప్రెస్‌‌ వే పిల్లర్‌‌ నెంబర్‌‌ 216 వద్దకు రాగానే అదుపుతప్పి పల్టీ కొట్టింది. 

దీంతో టమాట లోడ్​ చెల్లాచెదురైంది. వాటిని అక్కడున్న వారు అందని కాడికి తీసుకొని వెళ్లిపోయారు. డ్రైవర్‌‌, క్లీనర్‌‌కు గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.