టీయూలో అక్రమాలపై వేగంగా విచారణ ​.. ఈసీ మీటింగ్​లో తీర్మానం

టీయూలో అక్రమాలపై వేగంగా విచారణ ​..  ఈసీ మీటింగ్​లో తీర్మానం

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై  విచారణ స్పీడప్​ చేయాలని ఈసీ మెంబర్లు  నిర్ణయం  తీసుకున్నారు.  వర్సిటీ 60వ ఈసీ మీటింగ్​ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీ వాకాటి కరుణ అధ్యక్షతన శనివారం హైదరాబాద్​లో జరిగింది.  వర్సిటీ  వ్యవహారాలపై ప్రభుత్వం నుంచి యాక్షన్​ స్టార్ట్​ అయ్యిందని, దీన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు.  వీసీ రవీందర్​ గుప్తా  డైలీ వేజెస్​ కింద నియమించిన వారికి రూ.28,22,677 చెల్లించారని తేల్చారు.

ఈసీ పర్మిషన్​ లేనందున ఆ మొత్తం దుర్వినియోగం కిందకే వస్తుందని తీర్మానించారు. వీసీకి రిజిస్ట్రార్​ ను నియమించే అధికారం లేదని త్వరలోనే గవర్నర్​ను కలిసి యూనివర్సిటీలో పరిస్థితి వివరించాలని  నిర్ణయించారు.  ఈ నెల 17న మరోసారి సమావేశం కానున్నారు.  తన పర్మిషన్​ లేకుండా ఈసీ మీటింగ్​కు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని,  ఇంటర్నల్​​ ఈసీ మెంబర్లు సమావేశానికి వెళ్తే సర్వీస్​​ రద్దు చేస్తామని వీసీ రవీందర్​​ గుప్తా  చేసిన హెచ్చరికలను సభ్యులెవరూ పట్టించుకోలేదు.