IPL 2024 Auction: అనామక క్రికెటర్ కోసం ఫ్రాంచైజీల మధ్య వార్.. ఏకంగా రూ.10 కోట్లు

IPL 2024 Auction: అనామక క్రికెటర్ కోసం ఫ్రాంచైజీల మధ్య వార్.. ఏకంగా రూ.10 కోట్లు

ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ యువ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ రికార్డు ధర పలికాడు. అంతర్జాతీయ స్థాయిలో సరిగ్గా 10 మ్యాచ్ లు కూడా ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడు పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌ అతన్ని సొంతం చేసుకుంది. దిల్లీ క్యాపిట్స్, గుజరాత్ జట్ల మధ్య తీవ్ర పోటీ జరగగా.. చివరికి గుజరాత్ చేజిక్కించుకుంది.    

అంతర్జాతీయ లీగ్ లో సత్తా చాటే జాన్సన్.. బౌలింగ్ లో వేరియషన్స్ చూపించగలడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, జాన్సన్.. 12 అక్టోబర్ 2017న విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున లిస్ట్ A  క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2022–23 షెఫీల్డ్ షీల్డ్ సీజన్ టోర్నమెంట్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున 20 ఫిబ్రవరి 2023న ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన తొలి మ్యాచ్ ఆడాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్ షమీతో జాన్సన్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు.