ఢిల్లీ - పుణే స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ - పుణే స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ – పుణే స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. దానికి కొన్ని నిమిషాల ముందు విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. 

ఫ్లైట్ సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందకు దించేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేపట్టింది. అయితే విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారు అనే కోణంలో విచారణ చేపట్టారు.