స్పైస్ జెట్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడు

స్పైస్ జెట్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడు

మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ ప్రయాణికుడిని స్పైస్‌జెట్‌ విమానం నుంచి దించివేసింది. ఈ ఘటన సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాల్సిన ఎస్‌జి-8133 విమానంలో జరిగిన ఘటనపై క్రూ విభాగం ఉద్యోగిని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. బోర్డింగ్‌ కు సిద్ధంగా ఉన్న విమానంలో తనపట్ల ఓ ప్రయాణికుడు, అతనితోపాటు ఉన్న మరో వ్యక్తి అసభ్యంగా వ్యవహరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దీంతో వారిద్దర్ని విమానం నుంచి దించివేసి ఢిల్లీ విమానాశ్రయ పోలీసు స్టేషన్ లో అప్పగించినట్టు ఎయిర్ లైన్స్ తెలిపింగి.  ఆ తర్వాత ప్రయాణికుడు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పినా.. అతన్ని విమానం నుంచి దించేశారు. అనంతరం ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. కాగా సిబ్బందికి, ఇద్దరు ప్రయాణికులకు మధ్య జరిగిన గొడవకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.