ఫ్లైట్ 7గంటలు లేట్.. ఎయిర్‌పోర్ట్‌లో స్పైస్‌జెట్ ప్రయాణికుల ఆందోళన

ఫ్లైట్ 7గంటలు లేట్.. ఎయిర్‌పోర్ట్‌లో స్పైస్‌జెట్ ప్రయాణికుల ఆందోళన

డిసెంబర్ 1న ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ సిబ్బందికి వ్యతిరేకంగా పలువురు ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. పాట్నాకు వెళ్లే విమానం దాదాపు 7గంటలు ఆలస్యమవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సవరించిన సమయం గురించి ప్రయాణీకులకు ముందుగానే తెలియజేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది. దేశ రాజధాని నుంచి పాట్నాకు వెళ్లాల్సిన SG 8721 ఫ్లైట్ చాలా సేపు ఆలస్యమైంది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు, విమానాశ్రయం వద్ద నిరసనలు చేస్తూ, కేకలు వేస్తోన్న ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది.

స్పైస్‌జెట్ ఢిల్లీ-పాట్నా ఫ్లైట్ SG 8721 ఇప్పటికే దాని గమ్యస్థానానికి చేరుకుంది. ఫ్లైట్ బయలుదేరే సమయం గురించి ప్రయాణీకులకు ముందుగానే తెలియజేశామని విమానయాన సంస్థ చెప్పింది. ఈ సంఘటనపై స్పందించిన, స్పైస్‌జెట్ కూడా గత రాత్రి విమాన సమయాలను మార్చిందని, దాని గురించి ప్రయాణీకులకు తెలియజేసిందని నొక్కి చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ తెలిపింది.

ఇదిలావుండగా, ముంబైకి వెళ్లే మరో స్పైస్‌జెట్ విమానం రద్దు చేశామని, ఇది ప్రయాణికుల నిరసనలకు దారితీసిందని ఓ నివేదిక తెలిపింది. SG 8169 ఫ్లైట్ మొదట ఆలస్యమైందని, ఆ తరువాత విమానయాన సంస్థ రద్దు చేసిందని చెప్పింది. ముంబైకి వెళ్లే విమానాన్ని రద్దు చేయడంపై విమానయాన సంస్థ ఎలాంటి స్పందన లేదు. ముంబైలో నడపాల్సిన విమానం సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిందని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు.