కోజికోడ్ ప్రజలకు సెల్యూట్: హర్దీప్ సింగ్ పురి

కోజికోడ్ ప్రజలకు సెల్యూట్: హర్దీప్ సింగ్ పురి

కాలికట్: కేరళలోని కోజికోడ్‌లో విమాన ప్రమాదం కలకలం రేపింది. ల్యాండింగ్‌లో అదుపుతప్పిన ఎయిర్‌‌క్రాఫ్ట్‌ రన్‌వేను గట్టిగా ఢీకొట్టడంతో రెండు ముక్కలుగా విరిగింది. ప్లెయిన్‌లో ఉన్న ఇద్దరు పైలట్‌లు చనిపోగా, 100 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మొత్తంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు త్వరగా స్పందించి చాలా సాయం అందించారు. వీరి సేవలను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి మెచ్చుకున్నారు.

‘కోజికోడ్ ప్రజల స్ఫూర్తి, సంఘీభావం, సోదరభావానికి నా సెల్యూట్. వాళ్లు చాలా రిస్క్ తీసుకొని వెంటనే స్పందించి బాధితులకు సాయం చేశారు. పెద్ద విషాదాన్ని నివారించడంలో ఇది దోహదపడింది. ఏవియేషన్ ప్రొఫెషనల్స్ సేవలను మెచ్చుకోవాల్సిందే. వీబీఎం అదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది. భారతీయులు ప్రపంచంలోని ఏ మూలలో చిక్కుకుపోయినా వారిని స్వదేశానికి తీసుకొస్తాం. ఈ దుర్ఘటనలో చనిపోయిన 18 మందికి రాష్ట్రం తరఫున మొత్తం భారతీయుల వైపు నుంచి నివాళులు అర్పిస్తున్నా’ అని పురి పేర్కొన్నారు.