నార్త్-సౌత్ విభేదాలు తీసుకొచ్చేలా రాహుల్ వ్యాఖ్యలు

నార్త్-సౌత్ విభేదాలు తీసుకొచ్చేలా రాహుల్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలకు దిగారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్మృతి ఫైర్ అయ్యారు. రాహుల్ కామెంట్లు నార్త్-సౌత్ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు. ‘రాహుల్ గాంధీ చేస్తున్న విద్వేషపూరిత, ప్రతీకార రాజకీయాలు ప్రజలను అవమానించేలా ఉన్నాయి. అలాగే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య చీలికలు తీసుకొచ్చేలా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందే’ అని స్మతి స్పష్టం చేశారు.

రీసెంట్‌గా కేరళకు వెళ్లిన రాహుల్.. అక్కడకు రావడం తనకు రిఫ్రెషింగ్‌గా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు సమస్యలపై ఎక్కువ దృష్టి సారిస్తారని రాహుల్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు రాజకీయాలను చూసే విధానం వేరుగా ఉంటుందన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.