పోలీస్ సిబ్బందికి క్రీడలతో మేలు

పోలీస్ సిబ్బందికి  క్రీడలతో మేలు

మెదక్​ టౌన్, వెలుగు: పోలీస్​సిబ్బందికి క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం కలుగుతాయని ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు అన్నారు. మెదక్​లోని జిల్లా పోలీస్​ కార్యాలయం ఆవరణలో వారి కోసం క్రికెట్​గ్రౌండ్​ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాన్నారు. బుధవారం క్రికెట్​ గ్రౌండ్​కు భూమిపూజ చేశారు. యువ సిబ్బందిలో ప్రతిభను వెలికితీయడానికి, క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఈ మైదానం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజశేఖరరెడ్డి, సందీప్ రెడ్డి, ఆర్​ఐలు శైలేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.