కల్తీ మద్యం కలకలం పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయ్

కల్తీ మద్యం కలకలం పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయ్

పంజాబ్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కల్తీ మద్యం కారణంగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇథనాల్ కలిపిన నకిలీ హల్కహాల్ తాగి కనీసం 40 మంది ఆసుపత్రిలో చేరారని సంగ్రూర్ చీఫ్  మెడికల్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. అందులో మార్చి 20న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 21నాడు పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. 

మార్చి 22న మరో 8 మంది, ఈరోజు (మార్చి 23)  ఐదుగురు చనిపోయారు. దీంతో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి పెరిగినట్లు సంగ్రూర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చెప్పారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. గతంలో కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. 

Also Read : రౌడీ ఆటోడ్రైవర్.. కారు అద్దాలు పగలగొట్టి దౌర్జన్యం