నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌లో నకిలీ కోరమండల్ పొటాష్ విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొండాయిలపల్లికి చెందిన రైతు కొనుకటి రాజు యాప్ ద్వారా మూడు పొటాష్ బస్తాలు కొనుగోలు చేసి, పంట పొలంలో చల్లేందుకు బస్తా విప్పి చూడగా, అందులో 20 శాతం రసాయనం, మిగతా అంతా మట్టి ఉన్నట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం గ్రోమోర్ సెంటర్‌ను తనిఖీ చేసి, పొటాష్ బస్తాల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు ఏవో రజిత తెలిపారు. యూరియా సరఫరాలో లింకులు పెడుతున్న షాపులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
