మార్కెట్లోకి స్పుత్నిక్ వీ.. రేటెంతంటే..

మార్కెట్లోకి స్పుత్నిక్ వీ.. రేటెంతంటే..

అపోలోలో టీకా ప్రారంభం

హైదరాబాద్ వెలుగు: ఇండియాలో ఎమర్జెన్సీ వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌‌- వీ వ్యాక్సినేష‌‌న్ డ్రైవ్ సోమవారం ప్రారంభ‌‌మైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో సాఫ్ట్ లాంచ్‌‌ చేశారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో అపోలో గ్రూప్ ఆస్పత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్ ను అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.హరిప్రసాద్, డాక్టర్ రెడ్డీస్ సీఈవో ఎంవీ రమణ ప్రారంభించారు. రెడ్డీస్ ఉద్యోగి అశోక్ కు మొదటి డోసు వేసి వాక్సినేషన్ డ్రైవ్‌‌ను మొదలుపెట్టారు. 50 వేల మందికి టీకాలు ఇస్తామ‌‌న్నారు. 63 దేశాల్లో స్పుత్నిక్ వీ టీకా ఆమోదం పొందిందని, స్పుత్నిక్ వీ రేటు రూ.1200 నుంచి రూ.1250 వ‌‌ర‌‌కు ఉంటుందని తొలి విడత కింద 1.50 లక్షల డోసులు వచ్చాయని తెలిపారు.