స్పుత్నిక్‌‌ V వ్యాక్సిన్ ధర‌‌ రూ.750

స్పుత్నిక్‌‌ V వ్యాక్సిన్ ధర‌‌ రూ.750

2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్‌ లో స్టోర్‌ చేయొచ్చు: రష్యా
టీకా 95 శాతం ఎఫెక్టివ్‌ గా పని చేస్తుందని వెల్లడి

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌‌ స్పుత్నిక్‌‌ V రేటు ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌లో 10 డాలర్ల (రూ. 750) కన్నా తక్కువే ఉంటుందని రష్యన్‌‌ డైరెక్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్‌‌ (ఆర్డీఐఎఫ్‌‌) కిరిల్‌‌ డిమిట్రివ్‌‌ చెప్పారు. వ్యాక్సిన్‌‌ 95 శాతం ఎఫెక్టివ్‌‌గా ఉందని, ఇది రష్యాతో పాటు ప్రపంచానికి గుడ్‌‌ న్యూస్‌‌ అన్నారు. తక్కువ ధరకు దొరికే ఎఫెక్టివ్‌‌ వ్యాక్సిన్‌‌ స్పుత్నిక్‌‌ V అని చెప్పారు. మంగళవారం మాస్కోలో ఆయన వర్చువల్‌‌ కాన్ఫరెన్స్‌‌ ద్వారా మాట్లాడారు. ఇండస్ట్రియల్‌‌ లెవల్‌‌లో పొడి రూపంలో వ్యాక్సిన్‌‌ తయారీ సక్సెస్‌‌ అయిందని, దీని వల్ల 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మధ్య టీకాను స్టోర్‌‌ చేయొచ్చని, డిస్ట్రిబ్యూషన్‌‌ ఈజీగా జరుగుతుందని తెలిపారు.

క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ జరుగుతున్న దేశాల్లో రెగ్యులేటర్స్‌‌తో చర్చలు జరుగుతున్నాయని.. రష్యాతో ఇతర దేశాల్లో కలిసి 42 వేల మంది వలంటీర్లపై ట్రయల్స్‌‌ చేస్తున్నామని వివరించారు. ట్రయల్స్‌‌ డేటాను ఇంటర్నేషనల్‌‌ జర్నల్స్‌‌లో పబ్లిష్‌‌ చేస్తామని, అందరూ రివ్యూ చేసుకోవచ్చన్నారు. స్పుత్నిక్‌‌ వీను ఆర్డీఐఎఫ్‌‌, గమలెయ నేషనల్‌‌ రీసెర్చ్‌‌ సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎపిడమాలజీ అండ్‌‌ మైక్రోబయాలజీ కలిసి తయారు చేస్తున్నాయి. ఇండియాలో డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ ల్యాబ్‌‌ స్పుత్నిక్‌‌ క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్‌‌ కూడా చేయనుంది. మరోవైపు ఫైజర్‌‌, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా 90 శాతానికి పైగా ఎఫెక్టివ్‌‌గా పని చేస్తున్నాయని తయారీ సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి.