శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించారు. ఈనెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి, సుమంత్ నాయుడు మాట్లాడుతూ ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో చూసినప్పుడు అంతకుమించి ఆస్వాదించాం. ఇది హీరో క్యారెక్టర్ చుట్టూ జరిగే కథ. హీరో క్యారెక్టర్‌కి న్యూమరాలజీ అంటే నమ్మకం. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.
విష్ణు గారు చాలా డైలాగ్స్‌ని స్పాట్‌లో ఇంప్రవైజ్ చేస్తుంటారు. అవన్నీ ఆడియెన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే హీరోయిన్ ట్రాక్, రెండు ఫ్యామిలీస్ కూడా చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కథతో పాటు ట్రావెల్ అయ్యే కామెడీ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ యూత్‌కు కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ యూత్‌తోపాటు ఫ్యామిలీస్‌ను అలరిస్తుంది. అలాగే ఇందులో చాలా మంచి మ్యూజిక్ ఉంది. రిలీజ్ అయిన తర్వాత కొన్ని సాంగ్స్ గుర్తుండిపోతాయి. ఇక ఆడియెన్స్‌కి రిలేట్ అయ్యే కథలు చేయడంపైనే దృష్టి పెట్టాం. ప్రస్తుతం రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.
