
గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలోని కుర్చీ మడత సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. లేటెస్ట్ కుర్చీ మడతపెట్టి (Kurchi Madathapetti) లిరికల్ ఇప్పుడు యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ లిరికల్ సాంగ్ను 14M కి పైగా వీక్షించారు. ఇందులో శ్రీలీల (Sreeleela) రొమాన్స్కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమా శ్రీలీలకు ధమాకా అంత పేరు తెచ్చిపెడుతుందన్న టాక్ నడుస్తోంది. ధమాకా తర్వాత శ్రీలీలకి సరైన సక్సెస్ పడలేదు. భగవంత్ కేసరి భారీ హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా బాలయ్య ఖాతాలోకే పోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో శ్రీలీల రేసులో కాస్త వెనుకబడిందనే చెప్పాలి.
లేటెస్ట్ గుంటూరు కారంతో అమ్మడు అన్ని లెక్కలు సరి చేస్తున్నట్లే కనిపిస్తోంది. లంగావోణీలో శ్రీలీల హాట్ అప్పిరియన్స్ యువతని కట్టిపడేస్తోంది. అమ్మడి నడుముమైపై మహేశ్ చేతులు..కళ్లలో కళ్లు మస్త్ గా హైలైట్ అవుతున్నాయి. ఎరుపు రంగు లంగా వోణీలో మరింత స్పైసీగా ఆకర్షిస్తుంది. అమ్మడి ముక్కుకి పుడక..చెవులకు జుంకాలు అన్ని శ్రీలీలని యూత్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
లిరికల్ గానే ఆ రేంజ్లో కిక్ ఇస్తుందంటే? పూర్తి వీడియో సాంగ్లో శ్రీలీల సత్తా చాటే ఉంటుందని అంచనాలున్నాయి. సినిమా రిలీజ్కు ఇంకో 2 వీక్స్..అన్ని రోజులు ఆగడం కష్టం. దాన్ని కంటే పూర్తి ఆడియో సాంగ్ రిలీజ్ చేయండి బాస్..అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు..జనవరి 12న థియేటర్స్లో మాస్ జాతర కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ సాంగ్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.