
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela)కి టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ కోలీవుడ్ హీరోకి షాకిచ్చింది. ‘సింగం’ డైరెక్టర్ హరి(hari)తో హీరో విశాల్(Vishal) ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో నటించేందుకు శ్రీలీలకు ఆఫర్ రాగా మొహమాటం లేకుండా నో చెప్పేసిందట. ఎంత ప్రయత్నించినా కాల్షీట్లు సర్దుబాటు చేయడం ఈ హీరోయిన్‌కి కష్టంగా మారింది.
దీంతో ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ పూర్తి చేశాకే కోలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా అని డిసైడ్ అయ్యిందట. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే కాన్సెప్ట్‌ను శ్రీలీల పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో ఓవర్‌నైట్ స్టార్లుగా మారి ఒక్క ఫ్లాప్‌తో తెరమరుగైన హీరోయిన్లు ఉన్నారు. అందుకే కమిట్ అయిన సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తోంది.