జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ టౌన్లో బిగ్ బాస్ ఫేమ్, నటి శ్రీముఖి సందడి చేశారు. బస్టాండ్ సమీపంలోని సుభాష్ గంజ్‌లో ఏర్పాటు చేసిన సెల్ బే మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అభిమానులను ‘హలో.. ఎలా ఉన్నారు?’ అంటూ పలకరిస్తూ ఉత్సాహపరిచారు.
అనంతరం శ్రీముఖి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వినియోగం నిత్యజీవితంలో భాగమైందన్నారు. సంస్థ ఎండీ సోమ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికే 50కి పైగా స్టోర్లు ఉన్నాయని తెలిపారు. టైర్-2, టైర్-3 పట్టణాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ స్టోర్లను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
