
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు, ప్రజాపక్షం ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో విశాలాంధ్ర, ‘మన తెలంగాణ’ పత్రికలకు శ్రీనివాస్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేశారు.
ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. 1949, సెప్టెంబర్ 7న శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లాలోని పల్లెపహాడ్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ (హెచ్‌ఎస్‌యూ), ఆ తర్వాత ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్)లో చురుకుగా పనిచేశారు. కాగా, ఉమ్మడి ఏపీలో తొలిసారిగా ప్రెస్ అకాడమీ ఏర్పడినప్పుడు మొదటి చైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డి సేవలందించారు.