శ్రీచైతన్య బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా శ్రీలీల

శ్రీచైతన్య బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా శ్రీలీల

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా టాలీవుడ్ నటి శ్రీలీల నియమితులయ్యారు. విద్యారంగంలో  అనేక విజయాలను నమోదు చేశామని,  జాతీయ స్థాయి పోటీ పరీక్షలయిన ఐఐటీ– జేఈఈ, నీట్‌‌లలో కిందటేడాది మూడు నంబర్ వన్ ర్యాంకులను కైవసం చేసుకున్నామని సంస్థ డైరెక్టర్‌‌‌‌ బొప్పన సుష్మశ్రీ పేర్కొన్నారు.  శ్రీలీలను బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌‌‌గా నియమించడం ద్వారా మరో ముందడుగు వేశామన్నారు.

ప్రజలకు మరింత చేరువవుతామని పేర్కొన్నారు.  39 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీచైతన్య విద్యాసంస్థలు, ఎడ్యుకేషన్ సెక్టార్‌‌‌‌లో విప్లవాత్మక బోధనా పద్ధతులతో ఎంతో మంది విద్యార్ధులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాయి.  ఐఐటీ–జేఈఈ, నీట్ వంటి నేషనల్‌‌ లెవెల్‌‌ పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించాయి’ అని సుష్మశ్రీ  అన్నారు.

అగ్రశ్రేణి అధ్యాపక బృందం పర్యవేక్షణలో  ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని,  పోటీ పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధమైన బోధనా విధానాలను ప్రవేశ పెట్టామని పేర్కొన్నారు. విద్యారంగంలో శ్రీచైతన్య అంటే ఒక అద్వితీయమైన శక్తి అని శ్రీలీల అన్నారు. విద్యార్ధులను విజయ తీరాలకు చేర్చే  దిక్సూచి అని కొనియాడారు.