గాజులరామారంలోని శ్రీచిత్తారమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం విజయదర్శనం జరిగింది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి, ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు.
సాయంత్రం గాజులరామారం నుంచి శ్రీచిత్తారమ్మ దేవి ఆలయం వరకూ అమ్మవారి ఊరేగింపు కనులపండుగగా జరిగింది. గాజులరామారం రోడ్డు పొడవునా ఆటబొమ్మలు, తినుబండారాల దుకాణాలతో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వెలుగు, జీడిమెట్ల
