బలిజ మేడాలదేవి, గొల్లకేతమ్మలను పెండ్లాడిన మల్లికార్జున స్వామి

బలిజ మేడాలదేవి, గొల్లకేతమ్మలను పెండ్లాడిన మల్లికార్జున స్వామి

కొమురవెల్లి, వెలుగు: భక్తుల కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురెల్లి మల్లన్న లగ్గం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. మధ్యాహ్నం12.18 గంటలకు తోటబావి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మల్లికార్జున స్వామి బలిజ మేడాలదేవి, గొల్లకేతమ్మను పెండ్లాడారు. మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం తరఫున పుస్తె మట్టెలు, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మణికంఠ శివాచార్య స్వామి పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితుల ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బలిజ మేడాలమ్మ, గొల్లకేతమ్మ అమ్మవార్ల తరఫున మహదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు వరుడు మల్లికార్జునస్వామి తరఫున హాజరై కల్యాణం జరిపించారు. ఉదయం11.13 గంటలకు పాణిగ్రహణం, జిలకర్ర బెల్లం కార్యక్రమం మొదలవగా, 11.34 గంటలకు కన్యాదానం చేశారు. 12.18 గంటలకు మల్లికార్జునస్వామి బలిజమేడాలదేవి, గొల్లకేతమ్మను వీరశైవ ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం మాంగళ్యధారణతో వివాహమాడారు. స్వామివారి కల్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొమురవెల్లిలో 3 నెలల పాటు జరిగే జాతర బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి. 2రోజుల స్వామివారి కల్యాణంలో మొదటి రోజు సాయంత్రం రథోత్సవం జరిగింది.  సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, మహా మంగళహారతి నిర్వహించనున్నారు.

దృష్టికుంభంతో తొలిదర్శనం..
ఆదివారం తెల్లవారుజామున ఆలయ గర్భగుడిలో దృష్టికుంభంతో మల్లికార్జునస్వామి తొలిదర్శనం ప్రారంభమైంది. ముఖద్వారం వద్ద ఉదయం 5 గంటల కు దృష్టికుంభం నిర్వహించి స్వామికి చిత్ర కన్ను పెట్టి గుమ్మడికాయలను బలిహరణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూలవిరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసేందుకు భక్తులు బారులు తీరారు. మల్లన్న కల్యాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఒంటేరు ప్రతాప్​రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ హాజరయ్యారు. హుజూరాబాద్ ​బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ప్రత్యేక పూజలు చేశారు.