ఘనంగా శ్రీలక్ష్మీ శ్రీనివాస పద్మావతి కళ్యాణోత్సవం

ఘనంగా శ్రీలక్ష్మీ శ్రీనివాస పద్మావతి కళ్యాణోత్సవం

మెహిదీపట్నం, వెలుగు: వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సంఘం రామాలయంలో శ్రీ లక్ష్మీ, శ్రీనివాస, పద్మావతి కళ్యాణోత్సవం ఆలయ మఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 

శనివారం ఉదయం ఆలయంలోని సీతారాముల మూల విరాట్ విగ్రహాలకు ప్రత్యేక పూజలను చేశారు.  సాయంత్రం లక్ష్మి, శ్రీనివాస, పద్మావతి కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లంగర్ హౌస్ పురవీధుల గుండా గరుడ వాహనంపై ఊరేగించారు.