భారత్ నుంచి వచ్చే విమానాలపై శ్రీలంక నిషేధం 

V6 Velugu Posted on May 06, 2021

భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో  అనేక దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే UK,UAE, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.ఇప్పుడు ఆ  లిస్టులో శ్రీలంక కూడా చేరింది.

భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు శ్రీలంకలో దిగేందుకు ఇకపై అనుమతించబోమని శ్రీలంక పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. భారత్ లో కరోనా వ్యాప్తి కేసులు ఎక్కువ గా అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

Tagged corona cases, Sri Lanka bans, India flights, sharp rise

Latest Videos

Subscribe Now

More News