శ్రీలంకలో ప్రజల ఆగ్రహావేశాలు.. మంత్రి కారును ఏం చేశారో తెలుసా ?

శ్రీలంకలో ప్రజల ఆగ్రహావేశాలు.. మంత్రి కారును ఏం చేశారో తెలుసా ?

శ్రీలంక : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన లంకలో ప్రజల నిరసనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనలు ఉద్రిక్తం అవుతున్న క్రమంలో.. మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఊహించని స్థాయికి పెరిగిపోతుండడంతో ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. మాజీ మంత్రికి చెందిన కారును ఓ నదిలోకి తోసేశారు. మరికొంతమంది నేతలకు చెందిన కార్లను సైతం నీళ్లలోకి నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిత్యావసర వస్తువులు, ఇతరత్రా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఏమి తినాలని ఓ వ్యక్తి వాపోయాడు. ఒక పూట మాత్రమే తిని.. పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరోవైపు.. నిరసనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్న వారిపై రాజపక్స మద్దతు దారులు దాడులకు పాల్పడడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అధికారంలో ఉన్న ఎంపీల నివాసాలకు, వాహనాలకు నిప్పు పెట్టడంతో 9 మంది మరణించినట్లు సమాచారం. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ప్రతిపక్ష యునెైటెడ్ నేషనల్ పార్టీ (UNP) నేత రణిల్ విక్రమ సింఘే శ్రీలంక ప్రధానిగా ప్రమాణం చేశారు. శ్రీలంకలో సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. 

మరిన్ని వార్తల కోసం...

పశ్చిమబెంగాల్ : గ్రామంలో గజరాజు హల్ చల్

కారుపై ఎంపీ స్టికర్ తీసిందెవరు..?