ఐపీఎల్‌‌ తరహాలో శ్రీలంక ప్రీమియర్ లీగ్

ఐపీఎల్‌‌ తరహాలో శ్రీలంక ప్రీమియర్ లీగ్

ఎల్‌పీఎల్‌లో బిస్లా, గోనీ

నవంబర్‌‌ 21 నుంచి లీగ్‌‌ షురూ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ తరహాలో శ్రీలంక క్రికెట్‌‌ బోర్డు ప్లాన్‌‌ చేసిన లంకన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌(ఎల్‌‌పీఎల్‌‌)కు ముహుర్తం ఖరారైంది. లీగ్‌‌ షెడ్యూల్‌‌ను లంక క్రికెట్‌‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. మొత్తం ఐదు టీమ్స్‌‌ బరిలో ఉండగా..  కొలంబో, గాలే జట్ల మధ్య నవంబర్‌‌ 21న జరిగే మ్యాచ్‌‌తో ఈ లీగ్‌‌ మొదలవునుంది.  డిసెంబర్‌‌ 13న ఫైనల్‌‌ జరుగుతుంది. కాగా, ఇండియాకు చెందిన మన్‌‌ప్రీత్‌‌ గోనీ, మన్విందర్‌‌ బిస్లాను  కొలంబో ఫ్రాంచైజీ  కొనుగోలు చేసింది.  ఇండియా తరఫున రెండు వన్డేల్లో ఆడిన గోనీ.. ఐపీఎల్‌‌లో చెన్నై, పంజాబ్‌‌, డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు ప్రాతినిధ్యం వహించాడు. వికెట్‌‌కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ బిస్లా.. 2015 ఐపీఎల్‌‌లో బెంగళూరుకు ఆడాడు. వీరితో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్‌‌ ఎంజెలో మాథ్యూస్‌‌, డుప్లెసిస్‌‌, ఆండ్రీ రసెల్‌‌ … కొలంబో టీమ్‌‌లో ఉన్నారు.