లంక కెప్టెన్‌‌‌‌ షనక ఔట్

లంక కెప్టెన్‌‌‌‌ షనక ఔట్

న్యూఢిల్లీ :  వరల్డ్ కప్‌‌‌‌లో వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ దాసున్ షనక గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఉప్పల్‌‌‌‌లో పాక్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ సందర్భంగా అతని కుడి కాలు కండరానికి గాయమైంది. కోలుకునేందుకు కనీసం మూడు వారాలు పట్టనుంది. దాంతో  అతని స్థానంలో చమిక  కరుణరత్నెను శ్రీలంక జట్టులో చేర్చేందుకు ఐసీసీ టెక్నికల్‌‌‌‌ కమిటీ అనుమతి ఇచ్చింది.

విలియమ్సన్‌‌‌‌ 3 మ్యాచ్​లకు దూరం

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో హ్యాట్రిక్‌‌‌‌ విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్‌‌‌‌కు షాక్‌‌‌‌ తగిలింది.  కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌కు మళ్లీ గాయమైంది. శుక్రవారం బంగ్లాదేశ్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ సందర్భంగా వికెట్ల మధ్య పరుగెత్తే టైమ్‌‌‌‌లో ఫీల్డర్‌‌‌‌ విసిరిన త్రో అతని ఎడమ బొటన వేలిని బలంగా తాకింది. దీంతో ఎముకలో చీలిక వచ్చినట్లు ఎక్స్‌‌‌‌రేలో తేలింది. 
ఫలితంగా మెగా ఈవెంట్‌‌‌‌లో కివీస్‌‌‌‌ ఆడబోయే తర్వాతి మూడు మ్యాచ్‌‌‌‌ (18న అఫ్గానిస్తాన్‌‌‌‌తో, 22న ఇండియాతో, 28న సౌతాఫ్రికాతో)లకు విలియమ్సన్‌‌‌‌ అందుబాటులో ఉండటం లేదు.