శ్రీలంక చారిత్రాత్మక విజయం

శ్రీలంక చారిత్రాత్మక  విజయం

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో  దేశం కష్టాల్లో ఉన్న సమయంలో శ్రీలంక క్రికెట్‌‌ జట్టు తమ ఆటతో అభిమానులను అలరించింది. పన్నెండేళ్ల విరామం తర్వాత ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌‌ గెలిచింది.  మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో 4 పరుగుల తేడాతో ఆసీస్​పై లంక ఉత్కంఠ విజయం సాధించింది. దాంతో, మరో మ్యాచ్​ మిగిలుండగానే 3–1తో సిరీస్‌‌ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌‌లో  మొదట బ్యాటింగ్​ చేసిన లంక 49 ఓవర్లలో 258 రన్స్​కు ఆలౌటైంది. చరిత్​ అసలంక (110) సెంచరీ, ధనంజయ డిసిల్వ (60) ఫిఫ్టీతో రాణించారు. అనంతరం ఛేజింగ్​లో ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ (99) అద్భుతంగా పోరాడినా ఆసీస్ 50 ఓవర్లలో 254 స్కోరుకే ఆలౌటైంది.  చమిక కరుణరత్నె (2/19), ధనంజయ (2/39), వాండర్సే (2/40) సత్తా చాటారు.  లంక చివరగా 2010లో ఆసీస్‌‌పై వన్డే సిరీస్‌‌ నెగ్గింది.