పల్లెకెలె: లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత వన్డేల్లో ఇండియా విమెన్స్ టీమ్ కొత్త శకాన్ని ఆరంభిస్తోంది. మిథాలీ నుంచి కెప్టెన్సీ అందుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియా.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డేలో హర్మన్‌సేన విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మిథాలీతో పాటు గాయంతో బాధపడుతున్న వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఈ సిరీస్‌కు అందుబాటులో లేదు. ఇప్పటికే లంకపై టీ20 సిరీస్ గెలిచిన హర్మన్‌సేన అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. అదే టైమ్‌లో అన్ని విభాగాల్లో ప్లేయర్లు మరింత మెరుగ్గా రాణించాలని హర్మన్ కోరుకుంటోంది.
