బుకర్ ప్రైజ్ గెలుచుకున్న శ్రీలంక రచయిత షెహన్ కరుణ తిలక

బుకర్ ప్రైజ్ గెలుచుకున్న శ్రీలంక రచయిత షెహన్ కరుణ తిలక

శ్రీలంక రచయిత షెహన్ కరుణ తిలక 2022 సంవత్సరానికిగానూ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. షెహన్ కరుణ తిలక రాసిన.. ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా పుస్తకానికి బుకర్ ఫ్రైజ్ లభించింది. ఈ అవార్డు గెలుచుకున్న రెండో శ్రీలంక రచయితగా కరుణ తిలక రికార్డు సృష్టించారు. లండన్ లో సోమవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక వేడుకలో క్వీన్ కన్సార్ట్ కెమిల్లా నుంచి ఈ పురస్కారం అందుకున్నారు. బహుమతి కింద ఆయనకు 50,000 పౌండ్లు అందజేశారు. 

ఒక మిషన్‌లో చనిపోయిన యుద్ధ ఫోటోగ్రాఫర్ మరణానంతర జీవితం ఎలా సాగిందన్న విషయాలను కరుణ తిలక నవలలో వివరించారు. 2019లో ఆయనకు ఆంగ్ల భాషా సాహిత్య పురస్కారం దక్కింది. ఇదిలా ఉంటే 1992లో ఇంగ్లీష్ పేషెంట్ నవల రాసిన రచయిత మైఖేల్ ఒండాజే శ్రీలంక నుంచి బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి రచయితగా నిలిచారు.