అమ్మాయిది శ్రీలంక.. అబ్బాయిది కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని పందికుంటపల్లి. దేశాలు వేరైనప్పటికీ ప్రేమ అనే బంధం ఇద్దరినీ ఒక్కటి చేసింది. అబ్బాయి పేరు కటకం సురేందర్ 2018లో ఇంగ్లాండ్ దేశంలోని లండన్ కు ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. తాను పని చేస్తున్న ఆఫీస్ లో శ్రీలంక దేశానికి చెందిన జానుశిఖతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో తన కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. దీంతో ఈ జంటకు కరీంనగర్ లో వివాహం జరిపించారు. వీరి పెళ్లికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై.. కొత్త దంపతులను ఆశీర్వాదించారు.