
మెహిదీపట్నం, వెలుగు: లంగర్హౌస్సంఘం రామాలయంలో మంగళవారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మఠాధిపతి శ్రీరాహుల్ దాస్ బాబా ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభించారు. 18 వరకు కొనసాగుతాయని బాబా తెలిపారు. 17న శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయం ముందున్న శ్రీరామ్ లీలా మైదానంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాది మంది భక్తులతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారన్నారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని, సాయంత్రం వివిధ అలంకరణల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు.18న శ్రీరామ పట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని రాహుల్ దాస్ బాబా చెప్పారు.