ఇక డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణ చేయాలని సర్కారు నిర్ణయం

ఇక డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. రిజిస్ట్రేషన్ చట్టం 1908కి  సవరణ చేయాలని సర్కారు నిర్ణయం
  • సెక్షన్ 22బీ అమల్లోకి వస్తేసబ్​రిజిస్ట్రార్లకు పలు అధికారాలు
  • రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే విభాగాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసంధానిస్తూ ప్రత్యేక సాఫ్ట్​వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  
  • ప్రభుత్వ భూములఅక్రమ రిజిస్ర్టేషన్లకూ అడ్డుకట్ట 

హైదరాబాద్, వెలుగు: 
రియల్​ఎస్టేట్ మోసాలకు అవకాశంగా మారుతున్న డబుల్ రిజిస్ట్రేషన్లకు కళ్లెం వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేసిన స్టాంప్స్ అం డ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ బిల్లు పెట్టి ఆమోదించు కోవాలని ప్లాన్ చేస్తోంది. ఇది కేంద్ర చట్టం కావడంతో సవరణ తర్వాత అనుమతి కోసం కేంద్రానికి పంపనున్నారు. 

కేంద్ర హోం, న్యాయ శాఖల పరిశీలన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో సవరణలకు చట్టబద్ధత రానుంది. తమిళనాడు, ఏపీ ఇప్పటికే  సవరణ చట్టాలను అమల్లోకి తెచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భూముల రేట్లు పెరగడంతో అక్రమార్కులు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఒకే ఆస్తిని నకిలీ పత్రాలతో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసి అమాయ కులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు పెరు గుతుండడంతో వీటిని అరికట్టేందుకు రిజిస్ట్రేషన్ చట్టం-–1908కి సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

దీనివల్ల ఒక వ్యక్తి ఒక ప్లాట్​ను విక్రయించిన తర్వాత, అదే వ్యక్తి అదే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరొకరికి విక్ర యించే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఆస్తి యజమాని ఒకరైతే, నకిలీ పత్రాలతో సంబంధంలేని వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం, రికార్డుల్లో సర్వే నంబరు ఒకటి ఉంటే.. ఫిజికల్​గా వేరే చోట భూమి చూపి రిజిస్ట్రేషన్ చేయడం, తల్లిదండ్రులు విక్రయించిన ఆస్తిని తర్వాత వారసులు వచ్చి అమ్మడం, ఉన్న భూమి కన్నా ఎక్కువ భూమి చూపడం, హద్దులు మార్చ డం ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడం వంటి మోసాలు జరు గుతున్నాయి. ఇలాంటి వాటివల్ల సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇతర వివాదాలు నిత్యకృత్యమయ్యాయి.   

అమల్లోకి సెక్షన్ 22బీ.. 

నకిలీ పత్రాలతో జరిగే రిజిస్ట్రేషన్లు అటు కొన్నవారికి, ఇటు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఒక ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత అదే ఆస్తిని ఇంకొకరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్​చేయించుకున్నారని తెలిస్తే, అప్పటికే డబ్బు చెల్లించిన బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పోలీస్​స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉంటోంది. దీనివల్ల ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోతున్నారు. మోసపోయినట్లు తెలుసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలంటే కోర్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 

ఒకసారి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగాక.. దాన్ని రద్దు చేసే అధికారం సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉండదు. అందుకే డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్లను నిలువరించే అధికారాలను సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్లకు కట్టబెట్టేలా సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22-బీని అమల్లోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22బీ ద్వారా సబ్​రిజిస్ట్రార్.. ప్రతి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు తప్పనిసరిగా ఈసీని పరిశీలించాల్సి ఉంటుంది. అమ్ముతున్న వ్యక్తి పేరు మీద ఉందా? లేదా? ఒకవేళ అప్పటికే చేతులు మారి ఉంటే మరొకరికి విక్రయించకుండా చూసే అధికారాన్ని సబ్​రిజిస్ట్రార్​కు సెక్షన్​22బీ ద్వారా కల్పిస్తారు. ఒకవేళ నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాల్పడితే  దాన్ని రద్దు చేసే అధికారాన్ని కూడా సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్​కు ఈ సెక్షన్ కల్పిస్తుంది.  

మూడు శాఖలను అనుసంధానించేలా సాఫ్ట్​వేర్​ 

 రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే విభాగా ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైతం రూపొందిస్తున్నారు. దీనివల్ల డబుల్ రిజిస్ట్రే షన్లతో పాటు ప్రభుత్వ భూములు ఎట్టిపరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోనున్నారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​ల్లోని ప్రత్యేక వెబ్ పోర్టల్​లో రిజిస్ట్రేషన్లు జరుగు తుండగా, వ్యవసాయ భూము లకు సంబంధించి తహసీల్దార్ ఆఫీసుల్లో భూ భారతి పోర్టల్​లో రిజిస్ట్రేష న్లు జరుగుతున్నాయి. 

ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవ డంతో భూముల రిజిస్ర్టేషన్లలో అక్రమాలు జరుగు తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ప్రత్యేకించి నిషేధి త జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబ ర్లు మార్చి సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్​ల్లో రిజిస్ట్రేషన్లు చేసు కోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే భూ భార తిలో రిజిస్ర్టేషన్ల సమయంలో సర్వే మ్యాప్​లు ఉం డాలనే నిబంధన పెట్టారు. లైసెన్స్ డ్ సర్వేయ ర్లు రాగానే ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇదే తరహాలో నాన్ అగ్రికల్చర్ భూములకు సైతం లైసెన్స్​డ్ సర్వేయర్లతో మ్యాపింగ్​చేయించడం పైనా అధికారులు కసరత్తు చేస్తుండడం విశేషం.