Asia Cup 2025: రాణించిన బంగ్లా బౌలర్లు.. ఒక మాదిరి స్కోర్‌కే పరిమితమైన హాంకాంగ్

Asia Cup 2025: రాణించిన బంగ్లా బౌలర్లు.. ఒక మాదిరి స్కోర్‌కే పరిమితమైన హాంకాంగ్

ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హాంకాంగ్ బ్యాటింగ్ లో పర్వాలేదనిపించింది. తొలి మ్యాచ్ లో ఘోర ఓటమి తర్వాత బ్యాటింగ్ లో ఒక మాదిరి స్కోర్ చేసింది. గురువారం (సెప్టెంబర్ 11) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 42 పరుగులు చేసిన నిజాకత్ ఖాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. యాసిమ్ ముర్తాజా (28), ఓపెనర్ జీషన్ (30) అలీ రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, రిషద్ హుస్సేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన హాంకాంగ్ ఇన్నింగ్స్ ను స్లో గా ఆరంభించింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో అన్షుమాన్ రాత్ 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ దశలో హాంకాంగ్ ఇన్నింగ్స్ మరింత నెమ్మదించింది. తొలి 7 ఓవర్లలో కేవలం 5 రన్ రేట్ తో పరుగులు చేయగలిగారు. 12 పరుగులు చేసిన బాబర్ హయత్ జట్టు 30 పరుగుల స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఈ దశలో జీషాన్ అలీ, నిజాకత్ ఖాన్ నాలుగో వికెట్ కు 41 పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు.

►ALSO READ | BCCI president: బీసీసీఐ అధ్యక్ష పదవి రేస్‌లో సచిన్..? క్లారిటీ ఇచ్చిన మాస్టర్ బ్లాస్టర్

30 పరుగులు చేసి జీషాన్ ఔటైనా.. యాసిమ్ ముర్తాజాతో కలిసి నిజాకత్ ఖాన్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నాలుగో వికెట్ కు 46 పరుగులు జోడించి జట్టు స్కోర్ ను 120 పరుగులకు చేర్చారు. చివరి వరకు ఇన్నింగ్స్ ను నడిపించిన నిజాకత్ ఖాన్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి 7 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే చేసిన హాంకాంగ్ చివరి 13 ఓవర్లలో 106 పరుగులు చేసి బంగ్లాదేశ్ ముందు ఫైటింగ్ టోటల్ ఉంచింది.