సీతారాముల కల్యాణ వైభోగం

సీతారాముల కల్యాణ వైభోగం

ఉమ్మడి జిల్లాలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామగ్రామాన పండుగ శోభ కనిపించించి. రాములోరి ఆలయాలు రామనామంతో  మర్మోగాయి. వివిధ ఆలయాల్లో  సీతారాముల కల్యాణం చూసేందుకు భక్తులు తరలి వచ్చారు.  వేములవాడ, అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంటలో  కల్యాణం   కన్నుల పండువగా జరిగింది.  ఆలయ పూజారులు శేషం రామాచార్యులు వంశీధర్ ఆచార్యుల ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామి  ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని  నిర్వహించారు.  

కలెక్టర్ పమేలా సత్పతి  పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు.   పెద్దపల్లి నియోజకవర్గంలోని శ్రీ హనుమాన్, రామాలయాలు  భక్తజనంతో   కిటకిటలాడాయి.  ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.   గంగాధర, చొప్పదండి ఆలయాల్లో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సుంకె రవిశంకర్​ దంపతులు  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వెలుగు, నెట్​వర్క్